Posts

Showing posts from May, 2023

ఏ భయము నాకు లేనే లేదుగా-ఆరాధన ఆరాధన ఆరాధన-Ye bhayamu naku lene leduga-Aaradhana Aaradhana Aaradhana-song lyrics

ఏ భయము నాకు లేనే లేదుగా  నీవు తోడుండగా   ఏ దిగులు నాకు లేనే లేదుగా  నీ కృప నాతోనుండగా     ||2|| ఎంత లోతున పడిపోయిన  పైకెత్తగల సర్వశక్తుడా  పగిలిపోయిన ప్రతి పాత్రను  సరిచేయగల పరమ కుమ్మరి   ||2|| ఆరాధన  ఆరాధన  ఆ..రా..ధన     ||2|| ఆరాధన  ఆరాధన  ఆరాధన నీకేనయ్యా  ||2|| 1. గొర్రెల కాపరి ఐన దావీదున్       నీవు రాజుగా చేసినావుగా       గొల్యాతును  పడగొట్టుటకు       నీ బలమునే ఇచ్చినావయ్యా  ||2||     ప్రతి బలహీన సమయములో      నీ బలము  నాతోనుండగా       భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేద  ||2|| ఆరాధన  ఆరాధన  ఆ..రా..ధన     ||2|| ఆరాధన  ఆరాధన  ఆరాధన నీకేనయ్యా  ||2|| 2. ఘోర పాపి ఐన రాహాబున్       నీవు ప్రేమించినావుగా       వేశ్యగా జీవించినను       వారసత్వమునిచ్చినావుగా    ||2|| ...

చిరునవ్వుతో నింపిన యేసయ్యా-ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే song lyrics-Chirunavvutho nimpina Yesayya-Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa neeke

నా కనుల వెంబడి కన్నీరు రానీయక  నా ముఖములో దుఃఖమే ఉండనీయక  చిరునవ్వుతో నింపిన యేసయ్యా ||2|| ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే  ||4||  || నా కనుల || 1. అవమానాలను ఆశీర్వాదముగా       నిందలన్నిటిని దీవెనలుగా మార్చి  ||2||     నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై   ||2||  ||చిరునవ్వుతో|| 2. సంతృప్తి లేని నా జీవితములో      సమృధ్ధినిచ్ఛి ఘనపరచినావు   ||2||     నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్ఛి   ||2||  ||చిరునవ్వుతో|| Naa kanula vembadi kanneru raaneyaka naa mukhamulo dhukhame undaneeyaka  Chirunavvutho nimpina Yesayya ||2|| Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa neeke ||4||  ||Naa kannula || 1. Avamaanaalanu aasheervadamuga     nindhalannitini deevenalugaa maarchi ||2||     nenu vese prathi adugulo neeve naa deepamai  ||2|| || Chirunavvutho|| 2. Samtrupthi leni naa jeevithamulo      samrudhinichi ghanaparachinaavu ||2||     naa mu...

నిన్నే ప్రేమింతును - నిన్నే ప్రేమింతును యేసు- నే వెనుదిరుగా-Ninne preminthunu - Ninne preminthunu Yesu- Ne venudirugaa song lyrics

నిన్నే ప్రేమింతును -  నిన్నే ప్రేమింతును యేసు    నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా  *నీ సన్నిధిలో మోకరిల్లి - నీ మార్గములో సాగేద    నిరసించక  సాగేద  - నే వెనుదిరుగా    ||2|| నిన్నే పూజింతును  -  నిన్నే   పూజింతును   యేసు    నిన్నే  పూజింతును   - నే వెనుదిరుగా ||  నీ సన్నిధిలో   ||  నిన్నే కీర్తింతును  -  నిన్నే    కీర్తింతును     యేసు    నిన్నే   కీర్తింతును   - నే వెనుదిరుగా ||  నీ సన్నిధిలో   ||  నిన్నే ఆరాధింతు -  నిన్నే     ఆరాధింతు      యేసు    నిన్నే    ఆరాధింతు  - నే వెనుదిరుగా ||  నీ సన్నిధిలో   ||  నిన్నే ప్రార్ధింతును  -  నిన్నే      ప్రార్ధింతును       యేసు    నిన్నే   ప్రార్ధింతును  - నే వెనుదిరుగా ||  నీ సన్నిధిలో ...

నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచెద నీ వాక్యములో నే నిలచెద- నిను వెంబడించెద- ఆరాధన యేసు నీకే-Aaradhana yesu neeke-Nee chithamu ne cheseda - nee baatalo ne nadicheda song lyrics

నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచెద  నీ వాక్యములో నే నిలచెద- నిను వెంబడించెద   ||2|| ఆరాధన యేసు నీకే - ఆరాధన యేసు నీకే     ||2||  ||నీ చిత్తము|| 1. నీటిపైన నడచిన నా అద్భుత పాదముల్  చూచుచూనే నడిచెద అన్నివేళలా   ||2|| ఆరాధన యేసు నీకే - ఆరాధన యేసు నీకే     ||2||    ||నీ చిత్తము|| 2. గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు  లోబడుచునే ఉన్నవి - అన్నివేళలా   ||2|| ఆరాధన యేసు నీకే - ఆరాధన యేసు నీకే     ||2||    ||నీ చిత్తము|| Nee chithamu ne cheseda - nee baatalo ne nadicheda nee vaakyamulo ne nilacheda- ninu vembadincheda   ||2||   Aaradhana yesu neeke - Aaradhana yesu neeke ||2|| ||Nee chithamu|| 1. Neeti paina nadachina nee adbutha paadamul chuchuchune nadicheda annivelala ||2|| Aaradhana yesu neeke - Aaradhana yesu neeke ||2|| ||Nee chithamu|| 2. Gaali neeru agniyu -nee adbutha maataku lobaduchune unnavi - annivelala   ||2|| Aaradhana yesu neeke - Aaradhana ...

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా -Manasaara poojinchi ninnaaradistha bhajanalu chesi ninnu aaradistha-song lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా  భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా  చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్త్రాలు చేసి నేను  సంతోషగానాలను ఆలాపిస్తా ||4|| || మనసారా||  1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు ||2||  ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు ||2||  పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు  ||2||   నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు   ||2||  || మనసారా||  2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు   ||2|| సాతాన్ని ఓడించిన విజయశీలుడవు   ||2|| మరణము గెలచి తిరిగి లేచావు   ||2|| నీవే మార్గము సత్యము జీవము  ||2||  || మనసారా||  Manasaara poojinchi ninnaaradistha  bhajanalu chesi ninnu aaradistha  chappatlu kotti ninnu sthotraalu chesi nenu  Santhosha ganaalanu aalaapista ||4|| ||Manasaara || 1.Ninna nedu vunnavaadavu neevu  ||2||  aascharyakaaryamulu chesevaadavu neevu  ||2||  parama thandri neeve goppa devudavu  ||2||  needu biddaga nannu marchukunnavu  ||2||    ||Manasaara || 2. Rakshna ...

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics

 దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ ||2||  నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప   ఎంతో ఎంతో మహిమ  ||2||  నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ  ||2||  మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||  1. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా ||2||  నా జీవితాంతం నీ నామస్మరణే చేసేద  నా యేసయ్యా ||2|| ||నిన్ను భజియించి||  మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||  2. నా కొండ నీవే నా కోట నీవే  నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే  ||2||  నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా   ||2||  ||నిన్ను భజియించి||  మహిమా నీకే మహిమా - మహిమా నీకే మహిమా ||4||  Devaa paraloka dhuthali ninu paadi keerthimpa  yentho yentho mahima ||2||  ninnu bhuviloni prajalantha koniyaadi keerthimpa  yentho yentho mahima  ||2||  ninnu bhajiyinchi poojinchi aaradimpa neeke neeke mahima  ||2||  mahima neeke mahima- mahima neeke mahima ||4||  1. Kastala lon...

నీతో గడిపే ప్రతిక్షణము ఆనందభాష్పాలు ఆగవయ్యా- యేసయ్య యేసయ్య నా యేసయ్యా Neetho gadipe prathi kshanamu aananda bhashaapalu aagavayya yesayya yesayya naa yesayyaa

నీతో గడిపే ప్రతిక్షణము  ఆనందభాష్పాలు ఆగవయ్యా   ||2|| కృప తలంచగా - మేళ్లు యోచించగా   ||2|| నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక  యేసయ్య యేసయ్య నా యేసయ్యా   ||4|| 1. మారా వంటి నా జీవితాన్ని  మధురముగా మార్చి ఘనపరచినావు   ||2|| నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి   ||2|| రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు   || యేసయ్య  || 2. గమ్యమే లేని ఓ బాటసారిని  నీతో వున్నాను భయము లేదన్నావు   ||2|| నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే   ||2|| వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు     || యేసయ్య  ||   Neetho gadipe prathi kshanamu   aananda bhashaapalu aagavayya ||2|| krupa thalanchaga - mellu yochinchaga  ||2|| naa galamaagadu sthuthinchaka ninu keerthinchaka Yesayya yesayya naa yesayyaa ||4|| 1.Maaraa vanti naa jeevithanni madhuramugaa maarchi  ghanaparachinaavu  ||2|| naa prema chetha kaadu neeve nanu preminchi   ||2|| rakthanni chindinchi nannu rakshinchaavu  ||Yesayya|| 2. Ghamyame len...

గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics

 గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను  హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే ||గొప్ప దేవుడు|| 1. కుంటివారిని నడిపించాడు  గుడ్డివారికి చూపునిచ్చాడు ||2||  పక్షవాయువు కుష్టురోగుల దీనమొరను గైకొన్నాడు ||2||  మాటమాత్రం పలికినాడు - స్వస్థతనిచ్చాడు ||గొప్ప దేవుడు|| 2. రెండు చేపలు ఐదు రొట్టెలు  ఐదు వేలకు పంచినాడు ||2|| మరణమైన వారిని సైతం మాటతోనే లేపినాడు ||2|| నీటిపైన నడచినాడు - అద్భుత దేవుడు   ||గొప్ప దేవుడు|| 3. వచ్చెనేసు పాపుల కోసం  పాపములను క్షమియించాడు ||2|| నమ్మితే చాలు రక్షణ కలదని  నమ్ముకుంటే శిక్షన్నాడు ||2|| ప్రాణమే నీకై పెట్టాడు - రక్షణ నిచ్చాడు ||గొప్ప దేవుడు||   Goppa devudu raajula raju emani cheppanu  hey adbhuthaalu-hey chithraalu - hey aascharya kaaryaalu enno chesene ||Goppa devudu|| 1.kunti vaarini nadipinchaadu  guddivaariki chupunichaadu ||2|| pakshavaayuvu kustu rogula dheena moranu gaikonnadu ||2|| maata maatramu palikinaadu - swasthatha nichaadu ||Goppa devudu|| 2. Rendu chepalu ai...

హల్లెలూయా అని పాడి స్తుతిపను రారే జనులారా మనసారా ఊరూరా -Halleluyaa ani paadi stuthimpanu raare janulaara manasaara ooroora song lyrics

హల్లెలూయా అని పాడి స్తుతిపను  రారే జనులారా మనసారా ఊరూరా  1. పాడి పంటలనిచ్చి  పాలించు దేవుడని       కూడు గుడ్డలనిచ్చి - పోషించు దేవుడని ||2||      తోడు నీడగా నిన్ను కాపాడు నాధుడని ||2|| పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా  || హల్లెలూయా ||  2. తాత ముత్తాతల కన్నా - ముందున్న దేవుడని       తల్లి తండ్రులకన్నా - ప్రేమించు దేవుడని ||2||      కల్లాకపటము  లేని - కరుణాసంపన్నుడని ||2|| పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా  || హల్లెలూయా || 3. బంధుమిత్రులకన్నా - బలమైన దేవుడని      అన్నాదమ్ములకన్నా - ప్రియమైన దేవుడని  ||2||     కన్నబిడ్డలకన్నా - కన్నుల పండుగని  ||2|| పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా  || హల్లెలూయా || 4. రాజాధిరాజులకన్నా - రాజైన దేవుడని     నీచాతి నీచులను ప్రేమింప వచ్చెనని  ||2||     నిన్నా నేడు ఏకరీతీగా ఉన్నాడని  ||2|| పూజించి .....

ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు - Aayane kaapaadu devudu Aayane nadipinche devudu

నీటిపైన నడిచెను  గాలి సముద్రమును గద్దించెను  మృత్యుంజయుడై లేచెను  నాతో నిత్యము జీవించును    ||2|| ఆయనే కాపాడు దేవుడు  ఆయనే నడిపిం చే  దేవుడు  ఆయనే తోడైయుండు దేవుడు  ఆయనే  ||2|| 1. మనకొరకై మరణించి      సిలువలో ప్రాణమునిచ్చెను      జయశీలుడై లేచెను      పాపికి విడుదలనిచ్చెను  ||2||        ఆయనే కాపాడు దేవుడు  ఆయనే నడిపిం చే  దేవుడు  ఆయనే తోడైయుండు దేవుడు  ఆయనే  ||2|| 2.  మేఘముల మధ్యలో      బూరధ్వని శబ్దముతో      రారాజుగా దిగి వచ్చును      ఈ భూలోకమును ఏలుటకై  ||2|| ఆయనే అధికారముతో యేసయ్య   ఆయనే రాజ్యమేలుటకు  యేసయ్య  ఆయనే న్యాయాధిపతి యేసయ్యా    ||4||   ఆయనే కాపాడు దేవుడు  ఆయనే నడిపించే  దేవుడు  ఆయనే తోడైయుండు దేవుడు  ఆయనే  ||2||   Neetipaina nadichenu gaali samudramunu gaddinchenu mruthyunjayudai lechenu naatho nithyamu jeevinc...

గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా- Gaayapadina nee cheyi chapumu devaa nee siluva rakthamunu prokshinchumu naa prabhuvaa

గాయపడిన నీ చేయి చాపుము దేవా  నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా ||2|| సిలువే నాకు విలువైనది  ||2|| అదియే నా బ్రతుకున గమ్యమైనది - ఎంతో రమ్యమైనది  ||గాయపడిన || 1. ఎండిన భూమిలో మొలచిన లేత - మొక్కవలె నీవు ఎదిగితివి  ||2||     సురూపమైన ఏ సొగసైన  ||2||     లేనివానిగా నాకై మారితివి     ||గాయపడిన || 2. మనుష్యులందరు చూడనొల్లని - రూపముగా నాకై మారితివి     ||2||     మా రోగములు  మా వ్యసనములు    ||2||     నిశ్చయముగా నీవు భరియించితివి       ||గాయపడిన || 3. నీవు పొందిన దెబ్బల వలన - స్వస్థత మాకు కలిగినది    ||2||       నీవు కార్చిన రక్తమే  ||2||     మా అందరికి ఇల ప్రాణాధారము      ||గాయపడిన ||  #Gaayapadina nee cheyi chapumu devaa  nee siluva rakthamunu prokshinchumu naa prabhuvaa ||2|| Siluve naaku viluvainadi ||2|| adiye naa brathukuna gamyamainadi - entho ramyamainadi || Gaayapa...

గొప్పవాడు క్రీస్తుయేసు - Goppavaadu Kreesthu Yesu

గొప్పవాడు క్రీస్తుయేసు - పుట్టినాడు నీకోసం  పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింప రారండి  ||2|| ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు     ||2|| మహిమ ఘనతా నిత్య o  యేసుకే  హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  || గొప్పవాడు || 1. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు      నీ పాప జీవితం మార్చేవాడు యేసు ||2||      నీ బాధలన్నీ తీర్చేవాడు  యేసు     సంతోషజీవితం ఇచ్చేవాడు  యేసు ||2|| ||  మహిమ ఘనతా||  || గొప్పవాడు || 2. నీ రోగాలను స్వస్థపరచునేసు       నీ శాపాలను తీసివేయునేసు  ||2||       నీ శోకాలను మాన్పివేయునేసు      పరలోకభాగ్య o నీకు ఇచ్చునేసు    ||2|| ||  మహిమ ఘనతా||  || గొప్పవాడు ||      #Goppavaadu Kreesthu Yesu-Puttinaadu neekosam paatalu paadi naatyamu chesi aaradimpa rarandi  ||2|| Premaamayudu Mahimaanvithudu Unnavaadu anuvaadu ||2|| Mahimaa Ghanthaa nithyam Yesuke HAPPY CHRISTMAS MERRY...

Bhayamu Ledu Digule Ledu -Yahweh- భయము లేదు దిగులే లేదు- యావే

  భయము లేదు దిగులే లేదు  నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు  నిరీక్షణతో అనుదినం సాగేదను   ||2||  యావే నీవే నా దైవం  - తరతరములవరకు  యావే నీవే నా ఆశ్రయం - తరతరములవరకు నీవు కునుకవు నీవు నిదురపోవు - ఇశ్రాయేలున్ కాపాడువాడవు   ||2||  1. మరణ భయం అంతా పోయెను -  శత్రుభీతి అంతా తొలగించెను   ||2||           మరణమును  ఓడించి  శత్రువుని  జయించిన - సర్వాధికారివి  నా దేవా    ||2||  || యావే||  2. ఓటమిని అంతా తీసివేసి  - రోగాన్ని అంతా మాన్పివేసి   ||2||       జయశీలుడవు పరమ వైధ్యుడవు - సర్వశక్తుడవు నా రక్షక    ||2||   || యావే||  #Bhayamu Ledu Digule  L edu naa  jeevithamantha prabhu chethilo  niraasa nannennadu muttaledu  nireekshanatho anudhinam saagedhanu ||2||  Yahweh neeve naa daivam - tharatharamula varaku  Yahweh  neeve naa aasrayam - tharatharamu...

నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవే- Nazareeyudaa naa Yesayyaa enni yugalakainaa aaraadhya daivamu neeve - lyrics

నజరేయుడా నా యేసయ్యా  ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవే అని  గళమెత్తి నీ కీర్తి నే చాటెద  ||నజరేయుడా ||  1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి   ||2||      శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా ||2||      నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం   ||నజరేయుడా ||       2. అగాధ జలములకు నీవే ఎల్లలు వేసితివి ||2||      జలములలోబడి నే వెళ్లినా నన్నేమి చేయవు నా యేసయ్యా ||2||       నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం   ||నజరేయుడా ||  3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా ||2||      సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ||2||       నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం  నీకే వందనం   ||నజరేయుడా ||   #Nazareeyudaa naa Yesayyaa  enni yugalakainaa aaraadhya daivamu neeve ani  galamethi nee keerthi ne ch...

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు ఘడియ నాకు చూపుము - Naa Brathuku dhinamulu lekkimpa nerpumu devaa ee bhuvuni veedu ghadiya naaku choopumu- lyrics

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము  దేవా ఈ భువిని వీడు ఘడియ నాకు చూపుము  ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము  నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము  ||నా బ్రతుకు దినములు ||  1. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి      నా ఆశలు నా కలలనే  వెంబడించుచుంటిని       ఫలాలు లేని వృక్షమువలె ఎదిగిపోతిని      ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని      నా మరణ రోధన ఆలకించుమో ప్రభు      మరల నన్ను నూతనముగా చిగురు వేయని  ||నా బ్రతుకు దినములు ||  2. నీ పిలుపు నే మరిచితి నా పరుగులో నేనలసితి      నా స్వార్ధము నా పాపము  పతనస్థితికి చేర్చెను      నా అంతమెటులనుండునో భయముపుట్టుచున్నది      దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము      యేసు నీ చేతికి ఇక లొంగిపోదును      విశేషముగా రూపించుము నా శేషజీవితం  ||నా బ్రతుకు దినములు ||       # Naa Brathuku dhinamulu lekkimpa nerpumu devaa ee bhuvuni veedu ghad...

పావనుడా యేసు నిను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి - Paavanudaa Yesu ninu cherithi- lyrics

పావనుడా యేసు నిను చేరితి  నీ పాద సన్నిధి నే కోరితి  నే కోరితి  ||2||  దీనుడా సాత్వికుడా బహుప్రియుడా   ||2||  || పావనుడా||  1. ఆశ్చర్యకరుడా   నిను చేరితి - నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి  | |2||  ||దీనుడా||   ||పావనుడా ||  2. ఆలోచనకర్తా   నిను చేరితి - నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి  ||2||  ||దీనుడా||   ||పావనుడా ||   3. బలవంతుడా యేసు నిను చేరితి - నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి  ||2||  ||దీనుడా||   ||పావనుడా ||  4. సమాధానకర్తా నిను చేరితి - నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి  ||2||  ||దీనుడా||   ||పావనుడా ||  # Paavanudaa Yesu ninu cherithi  nee pada sannidhi ne korithi ne korithi ||2|| Dheenudaa saathvikudaa bahupriyudaa ||2|| ||Paavanudaa|| 1. Aascharyakaruda ninu cherithi - nee pada sannidhi ne korithi ne korithi   ||2|| ||Dheenudaa|| ||Paavanudaa|| 2 . Aalochanakartha ninu cherithi - nee pada sanni...

aascharyamaina Prema - Kalvariloni Prema ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ lyrics

 ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ  మరణము కంటే బలమైన ప్రేమది నను జయించే నీ ప్రేమ  ||2||  ||ఆశ్చర్యమైన ||  1. పరమును వీడిన ప్రేమ   - దరలో పాపిని వెదకిన ప్రేమ ||2||      నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే  ||2||  ||ఆశ్చర్యమైన ||  2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ ||2||      నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే   ||2||  ||ఆశ్చర్యమైన ||  3. శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ ||2||        విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు   ||2||  ||ఆశ్చర్యమైన ||  4. నా స్థితి చూసిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ ||2||       నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే   ||2||  ||ఆశ్చర్యమైన ||  #Aascharyamaina Prema - Kalvariloni Prema maranamu kante balamaina premadi nanu jayinche nee prema  ||2|| || Aascharyamaina ||    1. Paramunu veedina prema...

Sthuthi inchedaa nee naamam devaa anudinam -స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం lyrics

స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం  స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం  1. దయతో కాపాడినావు - కృపనే చూపించినావు  ||2||     నిను నే మరువనేసు  నిను నే విడువనేసు ||2||  ||  స్తుతియించెదా||  2.  పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు  ||2||          నిను నే మరువనేసు  నిను నే విడువనేసు ||2||  || స్తుతియించెదా||  3. శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం ||2||        నిను నే మరువనేసు  నిను నే విడువనేసు ||2||  || స్తుతియించెదా||   # Sthuthi inchedaa nee naamam devaa anudinam      Sthuthi inchedaa nee naamam devaa anukshanam 1. Dayatho kaapaadinaavu - krupane chupinchinaavu ||2||      ninu ne maruvanesu ninu ne viduvanesu ||2||  || Sthuinchedaa|| 2. Paapinai vundaga nenu  rakshinchi dari cherchinaavu ||2||     ninu ne maruvanesu ninu ne viduvanesu ||2||  || Sthuinchedaa|| 3. Siluve naa...

Mahimaku paatrudaa మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము lyrics

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా  మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము  ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా  నీవంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు  ||2|| 1. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం       నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము   ||2||    ||మహోన్నతుడా|| 2. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా      మా కరములను జోడించి మేము మహిమపరచెదం   ||2||   ||మహోన్నతుడా||   # Mahimaku paathrudaa - Ganathaku arhudaa Maa chethulethi memu ninnaaraadinthumu ||2|| Mahonnathudaa adbhuthalu cheyuvadaa  nee vanti vaaru evaru - nee vanti varu leru ||2|| 1. Sthuthulaku paathrudaa sthuthi chellinchedam      nee naamamentho goppadi memaaraadinthumu  ||2|| ||Mahonnathudaa|| 2. Adviteeya devudaa aadi sambhuthudaa       maa karamulanu jodinchi memu mahima parachedadm  ||2|| ||Mahonnathudaa||

అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా-Athyunnatha Simhaasanamupai - lyrics

 అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా  అత్యంత  ప్రేమాస్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే   ||2||  ఆ హా హా..... హల్లెలూయ   ఆ హా హా..... హల్లెలూయ  ఆ హా హా..... హల్లెలూయ    ||4||  ఆ హా హా..... హల్లెలూయ   ఆ హా హా.....  ఆమెన్  1. ఆశ్యర్యకరుడా స్తోత్త్రం -  ఆలోచనకర్తా స్తోత్త్రం     బలమైన దేవా  నిత్యుడవగు  తండ్రి - సమాధాన అధిపతి స్తోత్త్రం    ||2||   ||ఆ హా హా..... హల్లెలూయ ||  2. కృపా సత్య సంపూర్ణుడా  స్తోత్త్రం -  కృపతో రక్షించితివి  స్తోత్త్రం     నీ రక్తమిచ్చి విమోచించినావు - నా రక్షణకర్తా  స్తోత్త్రం  ||2||   ||ఆ హా హా..... హల్లెలూయ ||  3. మృత్యుంజయుడా   స్తోత్త్రం -  మహాఘనుడా స్తోత్త్రం    మమ్మును కొనిపోవా - త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్త్రం      ||2||   ||ఆ హా హా..... హల్లెలూయ ||  4. ఆమెన్ అనువాడా    స్తోత్త్రం -  ఆల్ఫా ఒమేగా స్తోత్త్...

Naa jeevitham Yesayyaku - నా జీవితం యేసయ్యకు ఒక కానుకగా ఇవ్వాలని lyrics

నా జీవితం యేసయ్యకు  ఒక కానుకగా ఇవ్వాలని ||2||  నా ప్రాణమెంతో ఆశ పడుచున్నది  నా ప్రాణము తృష్ణగొనుచున్నది  ||2||  దేవా వినుమా నా ప్రార్థన  దేవా గైకొనుమా ఈ దీనుని          ||నా జీవితం||  1. యేసు నీ రూపం కనులారా చూచి  పులకించి తరియించ ఆశ  నీ ప్రేమ మాకివ్వ లోకానికొచ్చి   జన్మించినావు స్తోత్త్రం         ||2||  నీ సేవలోనే నీ నీడలోనే - ఎల్లప్పుడూ నిలుపుమయ్యా   ||2||    ||నా  జీవితం ||   2. నన్ను నీవు మార్చేసినావు      నీ దాసునిగా ఇలలో      త్వరలో నీవు కనురెప్పపాటులో      కొనిపోయెదవు నీతో       ||2||      నా చింతలన్నీ నీ పైన వేసి - నీ శాంతి నే పొందెదను   ||2||   ||నా  జీవితం ||  #Naa jeevitham yesayyaku  oka kanukaga ivvalani  ||2||      Naa praanamentho aasha paduchunnadi     naa praanamu thrushnagonuchunnadi ||2|| ...

Adviteeyuda - మదిలోన నీ రూపం - నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ lyrics

*  అద్వితీయుడా నన్నేలు దైవమా వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను * మదిలోన నీ రూపం - నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ ||2|| కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము - వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో! అద్వితీయుడా || మదిలోన|| 1. ప్రతీ గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరీ అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేలలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవేకదా ! యేసయ్యా || మదిలోన|| 2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్య ఆదరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేదదీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా ! యేసయ్యా || మదిలోన|| 3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు నే వేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధప...

Gaganamu chilchukoni Ghanulanu teesukoni - గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవా రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా lyrics

 గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని  నన్ను కొనిపోవా రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా   ||2||  నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది  నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది  || గగనము ||  1. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది  నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది                ||2||  పవిత్రురాలైన కన్యకగా  నీ ఎదుట నేను నిలిచెదను                              ||2||  నీ కౌగిలిలో నేను విశ్రమింతును                        ||2||  || గగనము||  2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది  మర్మమైయున్న నీవలె  రూపించుచున్నది ||2||  కళంకము లేని వధువునై  నిరీక్షణతో నిను చేరెదను                                ||2||   యుగ యుగాలు నీతో ఏలెదను...

Nee krupalo nannu daachavu Yesayya Yesayya - నీ కృపలో నన్ను దాచావు యేసయ్య యేసయ్యా lyrics

నీ కృపలో నన్ను దాచావు యేసయ్య యేసయ్యా  నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయా  ||2||  నీ జీవమే నాలో ఉండగా  నాకు భయమే లేదయ్యా  నా తండ్రిగా నీవు ఉండగా  నాకు కొరత లేదయ్యా  నీ తోడు నాకు ఉంటే చాలయ్య చాలయ్యా  ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య యేసయ్యా    ||నీ కృపలో ||  1.  ఏ త్రోవ లేకున్నా - నిరాశలో ఉన్నా  నీ జీవ వాక్యముతో - నను నడుపుము యేసన్నా  ||2||  దయ చూపుమా - దీవించుమా  సమృద్ధి జీవముతో తృప్తిపరచుమా                    ||2||  ||నీ తోడు ||  ||నీ కృపలో ||  2. పేరు ప్రఖ్యాతలు ఉన్నా - సంపదలు ఉన్నా  నీ కృప లేకపోతే - అన్నియు వ్యర్ధమే  ||2||  నీ కనికరం - నీ కరుణ  నా జీవితానికి చాలు యేసయ్యా  ||2||  ||నీ తోడు ||  ||నీ కృపలో ||  3. కనురెప్ప పాటైనా నను విడువని యేసయ్యా  నీ సేవ చేయుటకే నేను జీవిస్తానయ్యా ||2|| నా ప్రార్థనా - ఆలకించుమా  పరిపూర్ణమైనవారిగా అభిషేకించుమా ||2||  ||నీ తోడు ||...

Naa priya yesu padivelalo athi sundaruda - నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా ...యేషూ ... వా... ఆ... ఆ... ఆ.. by Charles Benny

       నా  ప్రియ యేసు       పదివేలలో  అతి సుందరుడా  సుందరుడా   ||4||             యేషూ ... వా... ఆ... ఆ... ఆ..                            ||4||      1.  నీదే రాజ్యము- నీదే బలము         నీకే మహిమ  కలుగును- ఆమెన్                                 ||2 ||       యేషూ ... వా... ఆ... ఆ... ఆ..                                 ||4||            # Naa priya yesu         padivelalo athi sundaruda sundaruda    ||4||            Yeshu…uu…vaa..aaa…aaa…aaa  ...

నా ప్రాణ ప్రియుడు అతి సుందరుడు వేవేలలో పదివేలలో - Naa prana priyudu athi sundarudu vevelalo padivelalo - song lyrics

          నా ప్రాణ ప్రియుడు -అతి సుందరుడు       వేవేలలో - పదివేలలో       యేషూ ... వా... ఆ... ఆ... ఆ..         నీదే రాజ్యము- నీదే బలము        నీకే మహిమ  కలుగును- ఆమెన్        యేషూ ... వా... ఆ... ఆ... ఆ    #Naa prana priyudu athi sundarudu      vevelalo padivelalo    Yeshu…uu…vaa..aaa…aaa…aaa      Neede raajyamu - neede balamu    Neeke mahima kalugunu –Amen    Yeshu…uu…vaa..aaa…aaa…aaa   ..  

యావే , రాఫా , ఎలోహిం , షడ్డాయ్ ,యీరే , అడోనాయ్ కనబరచును Yahweh, Rapha, Elohim ,Shaddai ,jireh , Adonai kanabarachunu - Song lyrics

యావే , రాఫా  , ఎలోహిం ,  షడ్డాయ్  యీరే ,  అడోనాయ్ కనబరచును       1.   నీ మహిమే  ఈ స్థలంలో అనుభవిస్తున్నాం         నీవు గొప్ప కార్యాలు చేస్తున్నావు       పురికొల్పు నా విశ్వాసం                                                                                                                            || యావే ||  2.  ఆరాధనలో దర్శించును       వెతుకుచున్నచో కనబరచును       తట్టుచుండగ నీకు తెరచును                      ...