ఏ భయము నాకు లేనే లేదుగా-ఆరాధన ఆరాధన ఆరాధన-Ye bhayamu naku lene leduga-Aaradhana Aaradhana Aaradhana-song lyrics
ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నాతోనుండగా ||2|| ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన ||2|| ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2|| 1. గొర్రెల కాపరి ఐన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా గొల్యాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా ||2|| ప్రతి బలహీన సమయములో నీ బలము నాతోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేద ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన ||2|| ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2|| 2. ఘోర పాపి ఐన రాహాబున్ నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా ||2|| ...